కాజల్ అగర్వాల్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటినుండి తన సినిమాల ఎంపికను మార్చుకున్నట్లు తెలిసింది. కథల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోందట. నిజానికి కాజల్‌కి ఎప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అవకాశాలు వచ్చినా చేయడానికి ఆసక్తి చూపించలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాలలోనే ఛాన్స్‌లు అందుకుంటూ కమర్షియల్ సినిమాలకే ఎక్కువగా పరిమితమైంది. కానీ ఇప్పుడు ఆమెకి 36 ఏళ్ల వయసు, పైగా పెళ్లి అయింది. కనీసం ఇప్పుడైనా కొత్త క్యారెక్టర్లతో ప్రయోగాలు చేయకపోతే, తనలోని నటికి న్యాయం చేయలేను అని ఫీల్ అవుతోందట. అందుకే త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతోంది కాజల్. సంతోష్ శోభన్ హీరోగా గతంలో పేపర్ బాయ్ అనే సినిమా చేసిన జయశంకర్ దర్శకత్వంలో కాజల్ మెయిన్ లీడ్‌గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. జూలై నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి రానుంది.
Kajal Agarwal to star in Female Oriented Thriller