Sunday, December 22, 2024

భగవంత్ కేసరి నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన ఎన్ బి కె ‘భగవంత్ కేసరి’ టీమ్ గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ప్రధాన తారాగణంపై మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో వస్తూ బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లను అందజేస్తున్నారు.

టైటిల్‌ను విడుదల చేసిన అనంతరం టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఈ రోజు చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ చీరలో హోమ్లీగా కనిపించారు. సైకాలజీ పుస్తకం చదువుతూ ఫోన్‌లో మాట్లాడుతూ, పెద్ద అద్దాలు ధరించింది చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది.ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News