Monday, January 20, 2025

‘భగవంత్ కేసరి’ నుండి కాత్యాయనిగా ‘కాజల్ అగర్వాల్’

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ రో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.

కాత్యాయని గా కాజల్ అగర్వాల్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ట్రెడిషినల్ వేర్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకున్నారు కాజల్.  ట్రైలర్‌ను రివీల్ చేసే సమయాన్ని కూడా పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ రేపు రాత్రి 8:16 గంటలకు విడుదల అవుతుంది.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News