Friday, January 10, 2025

‘సత్యభామ’కు సొంతంగా డబ్బింగ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే అందం, అభినయంతో మెప్పించి స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. సుదీర్ఘ కాలం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ భామ తల్లి కావడంతో కాస్త విరామం తీసుకుంది. కానీ, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో సందడి చేస్తూ గతంలో మాదిరిగానే ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవలే కాజల్ ’భగవంత్ కేసరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమెలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ అనే సినిమాలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందుతోది.

సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ‘సత్యభామ’ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇటీవల విడుదలై టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో మె కాజల్ తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. ’సత్యభామ’ మూవీ కోసం కాజల్ అగర్వాల్ సొంతంగా డబ్బింగ్ చెప్పబోతుందట. దీంతో టాలీవుడ్‌లో తొలిసారి ఓ తెలుగు సినిమాకు పూర్తి స్తాయిలో ఆమె గొంతను అందింస్తోంది. అలాగే, ఈ మూవీ కోసం కాజల్ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News