టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది కన్నప్ప మూవీ యూనిట్. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో కన్నప్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నిటిస్తున్న మోహన్ లాలు, మోహన్ బాబు కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. వీరితోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మమ్ముట్టి, తదితర ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరికి సంబంధించిన ఒక్కొక్క పోస్టర్ ను విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా కాజల్ అగర్వాల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ఇందులో పార్వతీ దేవిగా నటిస్తున్నారు. ఈ పోస్టర్ లో కాజల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక, ప్రభాస్ శివుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఏడాది సమ్మర్ లో కన్నప్ప మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.