Monday, January 20, 2025

కాజల్ “సత్యభామ” టీజర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా “సత్యభామ” సినిమా టీజర్ ఇవాళ రిలీజ్ చేశారు.

“సత్యభామ” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. పై అధికారులు సత్య..ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే..కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ…యువతి హత్యకు కారణమైన హంతకులను చట్టం ముందు నిలబెట్టిందా లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News