హైదరాబాద్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పుదుచ్చేరిలోని ఓ కంపెనీ జనాలను మోసం చేసింది. కంపెనీ నిర్వహకులు పది మంది నుంచి రూ.2.40 కోట్లు వసూలు చేసి పారిపోయారు. బాధితుడు ఆశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శ్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022 కోయంబత్తూరులో తమన్నా బాటియాతో పాటు పలువురు ప్రముఖులతో కలిపి సదరు కంపెనీని నిర్వహకులు నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌లు ప్రారంభించారు.
మహాబలిపురంలో కంపెనీలో నిర్వహించిన సమావేశానికి కాజల్ అగర్వాల్ కూడా హాజరయ్యారు. కంపెనీ మీటింగ్‌లకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడంతో జనాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. కంపెనీ నిర్వహకులు నితీశ్ జైన్, అరవింద్ కుమార్ రూ.2.4 కోట్లు తీసుకొని పారిపోయారు. బాధితుడు ఆశోకన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నటిమణులు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను సదరు కంపెనీ గురించి ప్రచారం చేయడంతో పోలీసులు వారిని విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారు.