Sunday, January 19, 2025

ప్రియురాలికి బహుమతిగా రూ.100 కోట్ల బిల్డింగ్

- Advertisement -
- Advertisement -

స్క్రాప్ మాఫియాపై పోలీస్‌ల దాడుల్లో బయటపడిన వైనం

స్క్రాప్ మాఫియాపై పోలీస్‌ల దాడుల్లో బయటపడిన వాస్తవాలువడానికి ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. ఈనేపథ్యంలో రవికన్హా అనే గ్యాంగ్‌స్టర్ రవీంద్ర నగర్ కాలనీలో 16 మంది సభ్యులతో స్క్రాప్ మెటీరియల్ సేకరించి అక్రమంగా విక్రయిస్తున్నాడు. వచ్చిన డబ్బుతో పెద్ద బిల్డింగ్ కొన్నాడు. కొన్నాళ్లకు అతని జీవితం లోకి కాజల్ ఝా అనే యువతి వచ్చింది. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని చెప్పి అతని వ్యాపారంలో ముఖ్యసభ్యురాలిగా చేరికయింది. వీరి మధ్య చనువు పెరిగి ప్రేమ వరకు దారి తీసింది.

ఈ క్రమంలో దక్షిణ ఢిల్లీ లోని ఫాష్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో దాదాపు రూ.100 కోట్ల విలువైన మూడు అంతస్తుల భవనాన్ని ఆమెకు గిఫ్ట్‌గా రవికన్హా అందజేశాడు. స్క్రాప్ మాఫియాను పట్టుకునే పనిలో బుధవారం పోలీస్‌లు ఆ భవనంపై దాడులు జరపగా వాస్తవాలు బయటపడ్డాయి. పోలీస్‌ల నుంచి స్క్రాప్ మాఫియా తప్పించుకుంది. ప్రియురాలికి రవి అంత విలువైన బిల్డింగ్ కానుకగా ఇచ్చాడని తేలింది. స్క్రాప్ అక్రమ రవాణాలో రవి కొన్ని కోట్లు సంపాదించినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. రవిపై ఇదివరకే 11 కేసులు ఉన్నాయి. ఇప్పటికే స్క్రాప్ గొడౌన్లను సీలు చేశారు. గ్యాంగ్‌స్టర్ రవి, అతని ప్రియురాలు , ఇతర సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News