- Advertisement -
ఓటీటీ రాకతో ఓ వైపు ప్రయోగాలు చేయడానికి అవకాశం దక్కిందంటున్న కాజల్.. మరోవైపు ఇదే ఓటీటీ థియేటర్ వ్యవస్థను మింగేసిందని అభిప్రాయపడుతోంది. చాలా మంది ఇళ్లలో ప్రశాంతంగా కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారని, ఇది థియేటర్లకు మంచిది కాదని ఈ బ్యూటీ పేర్కొంది. “కరోనా వల్ల ఫిలిం, టెలివిజన్ ఇండస్ట్రీలు బాగా దెబ్బతిన్నాయి. అదే టైమ్లో ఓటీటీ వచ్చి టీవీని, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని అధిగమించింది. ప్రజలు తమ ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. అయితే ఈ పరిస్థితులు తాత్కాలికమే. ఎప్పటికైనా ఇండియాలో ఓటీటీపై థియేటర్లదే ఆధిపత్యం”అని కాజల్ పేర్కొంది.
- Advertisement -