Monday, January 20, 2025

తప్పు చేయడం వల్లే ఆ నలుగురు ఎంఎల్‌ఎలు సస్పెండ్: మంత్రి కాకాణి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: తప్పు చేయడం వల్లే ఆ నలుగురు ఎంఎల్‌ఎలను సస్పెండ్ చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఎంఎల్‌ఎలంతా సిఎం జగన్ మోహన్ రెడ్డి చరిష్మా వల్లే గెలిచారని ప్రశంసించారు. వైసిపి ఎంఎల్‌ఎలు అమ్ముడుపోయారని సజ్జల అన్నారని తప్ప పేర్లు చెప్పలేదన్నారు. డబ్బులు తీసుకున్న వాళ్లే భుజాలు తడుముకుంటున్నారని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. క్రాస్ ఓటింగ్ ఎవరు వేశారనేది అందరికీ తెలుసునని, ఎవరు పార్టీ వీడినా ఇబ్బంది లేదని, పార్టీ పటిష్టంగా ఉందని మంత్రి కాకాణి తెలిపారు. ఎంఎల్సీ ఎన్నికలలో వైసిపి ఎంఎల్ఎలు కొందరు టిడిపి ఓట్లు వేసిన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News