Monday, January 20, 2025

మంత్రి కాకాణి ఇలాకాలో భారీ కుంభకోణం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఇలాకాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలతో ఇరిగేషన్ పనులు మొదలు పెట్టారు. ఇరిగేషన్ టెండర్ల ప్రక్రియకు ఈ నెల 5 వరకు గడువు ముగియనుంది. టెండర్లు పూర్తికాకుండానే మంత్రి కాకాణి అనుచరులు పనులు చేపట్టారు. 20 రోజుల ముందే పనులు కాకాణి అనుచరులు ప్రారంభించారు. నక్కలవాగులో అనధికారిక పనులను టిడిపి నేత సోమిరెడ్డి పరిశీలించారు. మంత్రి కాకాణి ఇలాకాలో కుంభకోణం జరుగుతుంటే కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు స్పందించరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాధికారులు మంత్రి దగ్గర కూలీలులాగా పని చేస్తున్నారా? అని సోమిరెడ్డి చురకలంటించారు. ఇరిగేషన్ పనుల్లో ఇప్పటికే వంద కోట్ల రూపాయల అవినీతి జరగిందని మండిపడ్డారు.

Also Read: టికెట్ రేసులో కడియం, రాజయ్యతో సర్పంచ్ నవ్య పోటీ….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News