Monday, December 23, 2024

గ్రామ చరిత్రను రాయనున్న కాకతీయ విద్యార్ధులు

- Advertisement -
- Advertisement -

చరిత్ర మనమే రాసుకుందామంటూ మద్దతిచ్చిన కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు
సంస్కృతి నుండి ఊరి పూర్వీకుల వరకు


మన తెలంగాణ/హైదరాబాద్: తమ గ్రామ చరిత్రలను తామే రాసే విధంగా కళాశాల విద్యార్థులను సంసిద్ధం చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్, ప్రొఫెసర్ తాడికొండ రమేశ్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టిన మన చరిత్రను మనమే రాసుకుందాం అనే కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం సంపూర్ణ మద్దతు ప్రకటించిన సందర్బంగా, గురువారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మన్ జూలూరి గౌరిశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. కాకతీయ యూనివర్శిటి పరిధిలోని 11 జిల్లాల్లోని డిగ్రీ, పిజి విద్యార్ధులచేత రాష్ట్రంలో తమ తమ గ్రామ చరిత్రలను విపులంగా రాయించేందుకు తగిన ప్రణాళికల గురించి తాడికొండ రమేశ్ చర్చ జరిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదిన ఖమ్మం నుండి శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించారు.

ఖమ్మంలో ఎస్.ఆర్ ఎండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజి నుండి మొదలు పెట్టనున్నారు. ఆ కలేజి అధ్యాపకుల ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ పర్యవేక్షణలో విద్యార్థులచేత తెలంగాణలో తమ గ్రామ చరిత్ర గొప్పతనం గురించి రాయించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పిలుపునిచ్చారు. ఉన్నఊరు కన్నతల్లి ఒకటే అని గర్వంగా చెప్పుకుంటూ తమ ఊరి గొప్పతనాన్ని గ్రామ నైసర్గిక, చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారాన్ని విద్యార్ధులచేత రాయించడం వలన చరిత్రకు కొత్తదారి వేసినట్లయిందని రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరిశంకర్ హర్షం వ్యక్తం చేశారు.

రచన రంగంలో ఇది మరో విప్లవమని పేర్కొన్నారు. ఇప్పటికే నల్గొండలో నాగార్జున ప్రభుత్వ డిగ్రి, పిజి కాలేజీ విద్యార్ధులు 200 గ్రామాల చరిత్రలను రాస్తున్నారని జూలూరు తెలిపారు. ఊరి చరిత్ర, ఊళ్ళో దేవాలయాలు, శాసనాలు, పాత నిర్మాణాలు, పరిశ్రమలు, చేనేత వృత్తులు, రవాణా సదుపాయాలు, నీటి వసతి, ఊళ్ళో ప్రముఖులు, పూర్వికులు తదితర గ్రామీణ సంస్కృతిని విద్యార్ధులు రికార్డు చేస్తారని జూలూరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News