Monday, December 23, 2024

కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

వరంగల్:జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. కాలేజీలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మెడికల్ కాలేజీలో 281మందికి పరీక్షలు చేయగా 29మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రిన్సిపాల్ సహా ముగ్గురు ప్రొఫెసర్లు, 26మంది విద్యార్థులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బత్తుల శ్రీనివాస్‌.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.

Kakatiya medical students test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News