Monday, December 23, 2024

కాకతీయ యూనివర్సిటీకి కంపౌండ్ ఎందుకు నిర్మించలేదు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కాకతీయ యూనివర్సిటీని పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. వర్సిటీకి కనీసం కంపౌండ్ ఎందుకు నిర్మించలేదని గత ప్రభుత్వాన్ని అడిగారు. కాకతీయ వర్సిటీ కంపౌండ్‌కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 652 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ చుట్టుపక్కల కంపౌండ్ వాల్ నిర్మిస్తామని చెప్పారు. 75 రోజుల్లోనే 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని, సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. మంత్రివర్గ నిర్ణయం మేరకు కంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు ఇచ్చామని ఇప్పటి వరకు నాలుగు అమలు చేశామన్నారు. వంద రోజుల లోపు ఆరు గ్యారెంటీలు ప్రతి గడపకు చేరుస్తామని చెప్పారు. రేపు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని తెలియజేశారు. తెలంగాణలోని యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,  కానీ ఇప్పటి వరకు విద్యార్థులు, యూనివర్సిటీలను ఎందుకు పట్టించుకోలేదని కెసిఆర్ ప్రభుత్వాన్ని పొంగులేటి సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News