Saturday, December 28, 2024

బాలికపై సిఐ అత్యాచారం… కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

వరంగల్: ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన పోలీస్ అధికారి.. కామంతో కళ్లు మూసుకొనిపోయి 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సదరు సిఐపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లిలో బండరా సంపత్ అనే పోలీస్ విఆర్ సిఐగా పని చేస్తున్నారు. 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో అతడు ఎస్‌ఐగా పని చేశాడు. అప్పుడు హనుమకొండలోని ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నాడు. అతడు ఖమ్మం జిల్లాకు బదిలీ అయినా తరువాత కూడా ఆమెతో టచ్‌లో ఉన్నాడు. జయశంకర్ భూపాలపల్లికి విఆర్ సిఐగా బదిలీ అయ్యాడు. పలుమార్లు ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. సదరు మహిళతో చనువుగా ఉండడంతో ఆమె కూతురు(16)పై అతడు కన్నేశాడు. మహిళ లేనప్పుడు బాలికపై సిఐ అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయం తన తల్లికి చెప్పడంతో కెయు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ సంపత్‌పై అత్యాచారంతో పాటు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News