అమరావతి: నాటు తుపాకీ పేలి ఓ బాలిక మృతి చెందిన సంఘటన కాకినాడ జిల్లా తుని మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. లోవకొత్తూరు గ్రామంలో పలివెల రాజు- నాగమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ధన్య శ్రీ(4) ఇంట్లో ఆడుకుంటుండగా కుప్పకూలిపోయింది. వెంటనే బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. చిన్నారి దేహంలో బుల్లెట్ ఉందని వైద్యులు గుర్తించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్‌ఐ విజయ బాబు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ధన్య శ్రీ ఇంటి పక్కన సిద్దాంతపు దుర్గా ప్రసాద్‌కు పందులను కాల్చే నాటు తుపాకీ ఉంది. తుపాకీలోకి మందు గుండు సామాగ్రిని లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో బాలిక వీపు నుంచి గుండెలోకి దూసుకపోవడంతో బాలిక కుప్పకూలిపోయింది. దుర్గా ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: రంగు మారిన తుంగభద్ర జలాలు