Wednesday, January 22, 2025

పేలిన సిలిండర్లు… ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని కకోరి ప్రాంతంలో సిలిండర్ పేలింది. ఒక ఇంట్లో సిలిండర్లు పేలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు సమాచారం. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి రెండు సిలిండర్లు పేలాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. మృతులు ముషీర్(50), హుస్నా బానో(45), రాజ్య(07), ఉమా(04), హీనా(02)గా గుర్తించారు. గాయపడిన వారు అనమ్(18), అజ్మద్(34), లకబ్(21), ఇషా(17)గా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News