Thursday, January 2, 2025

‘కాల భైరవ’గా రాఘవ లారెన్స్

- Advertisement -
- Advertisement -

రాక్షసుడు, ఖిలాడి వం టి చిత్రాలను రూ పొందించిన ప్రముఖ నిర్మా త కోనేరు సత్యనారాయణ ఇప్పుడు ఏ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నా రు. ఏ స్టూడియోస్ ఎల్‌ఎల్ పి, గోల్డ్‌మైన్ టెలీ ఫిల్మ్, నీ లాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. డైనమిక్ స్టార్ రాఘవ లారెన్స్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ రాక్షసుడు, సెన్సేషనల్ మూవీ ఖిలాడి వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ రమేష్ వర్మ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ నిర్మాణాత్మక దశలో ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాఘవ లారెన్స్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఆర్‌ఎల్25 చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరే సత్యనారాయణ, మనీష్ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు. ‘కాల భైరవ’ చిత్రాన్ని తెలు గు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రా రంభం అవుతుంది. 2025 వేసవిలో సినిమాను విడుదల చేయబోతున్నారు.

పుట్టినరోజు కానుకగా…

రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్‌లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవా రం లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘బుల్లెట్ బండి’ అనే క్యాచి టైటిల్ పెట్టా రు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలిష్ పోలీస్ క్యారెక్టర్‌లో చూపించి న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News