పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రధారులుగా సుధాకర్ బుర్రి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “కాల గమనం’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, హరిహర వీరమల్లు నిర్మాత ఏయం రత్నం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫిలిం ఛాం బర్ సెక్రటరీ మోహన్ గౌడ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఏయం రత్నం మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టైటిల్ కాలగమనం ఇప్పటి పరిస్థితు లు అనుగుణంగా ఉన్నట్టుంది. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను‘అని అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లా డుతూ ‘లెజెండరీ ప్రొడ్యూసర్ ఏయం రత్నం గారు మా పోస్టర్‌ను ఆవిష్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన చేతులు మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగటం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తయ్యాయి. మార్చి చివరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. హీరో రాజా మాట్లాడుతూ.. ‘నేను ఈ చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ చిత్రం తప్పకుండా నాకు ఓ ల్యాండ్ మార్క్ అవుతుందని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు.