Wednesday, January 22, 2025

మెలోడి సాంగ్ ఆఫ్ ది ఇయర్

- Advertisement -
- Advertisement -

Kalaavathi Song From Sarkaru Vaari Paata Unveiled

సూపర్‌సార్ మహేశ్‌బాబు హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ ప్రోమో ఇటీవల విడుదలై ఫుల్ సాంగ్ కోసం అందరూ ఎదురు చూసేలా చేసింది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఆదివారం ఈ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. తమన్, సింగర్ సిద్ శ్రీరామ్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట ఈ ఏడాది మెలోడి సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఈ పాటలో అన్ని ఫర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. మహేష్‌బాబు హుక్ స్టెప్ అద్భుతంగా ఉంది. అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది ఈ సాంగ్. మహేష్ బాబు స్వాగ్, కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు గ్లామర్ జోడించింది. ఈ మూవీలో మహేష్‌బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నాడు దర్శకుడు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ చిత్రం వేసవి కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News