Monday, December 23, 2024

‘కళావతి’ సాంగ్ ప్రోమో అదిరింది.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ మూవీలోని ‘కళావతి’ అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాట ఖచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతారంలో మహేష్ బాబుని చూపిస్తున్నాడు పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

https://youtu.be/bwrBhrXfKbs

Kalaavathi Song Promo out from Sarkaru Vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News