Wednesday, January 22, 2025

కళాభారతి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలో చేపట్టిన కళాభారతి పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. గురువారం ఆయన కళాభారతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామి , డిప్యూటీ ఇంజనీర్ సంధ్యలు కలాభారతి పనుల పురోగతిని దగ్గరుండి జిల్లా కలెక్టర్‌కు చూపించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కళాభారతి పనులు నత్తనడక నడుస్తున్నాయని, ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైతే ఎక్కువ యంత్రాలను ఏర్పాటు చేసి పనుల వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కళాభారతిపై భాగంలో నిర్మిస్తున్న షెడ్డు పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలెక్టర్‌కు వివరించారు. మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, ఆర్‌అండ్‌బి ఏఈ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News