Thursday, January 23, 2025

ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన బిజెపి కార్యకర్తలు!

- Advertisement -
- Advertisement -

కలబురగి: కలబురగి దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలోని సంగమేశ్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి కలబురగి డిప్యూటీ కమిషనర్ యశ్వంత్ గురుకర్ ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన గురుకర్ చర్యలు తీసుకున్నారు. బిజెపి ఎంఎల్‌ఎ దత్తాత్రేయ పాటిల్ రేవూరు మద్దతుదారులు కాలనీలో డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు ఇతర పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకుండానే గురుకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గురుకర్‌ను చూసిన వెంటనే ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అతను సెంట్రల్ బస్టాండ్ వద్ద వారి కారును వెంబడించి పట్టుకున్నారు. నగదు బ్యాగ్‌తో ఉన్న మరో వ్యక్తి ఘటనా స్థలం నుంచి పారిపోయాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. గురుకర్  ఈ వ్యక్తులను పట్టుకుని తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత ఆ ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు కలబురగి నగర పోలీస్ కమిషనర్ ఆర్.చేతన్ తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే, కలబురగి దక్షిణ అభ్యర్థి అల్లం ప్రభు పాటిల్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News