Thursday, January 23, 2025

ఇద్దరు పిల్లలను వీపుకు కట్టకొని బావిలో దూకిన తండ్రి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇద్దరు పిల్లలను వీపుకు కట్టుకొని కన్నతండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం కలబురిగి జిల్లా చించోళి తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వికారాబాద్ జిల్లా తాండూరు చెందిన సంజప్ప వద్దార్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం కలబురిగి జిల్లాకు వలసపోయాడు. సంజప్పకు కుమారుడు ఓంకార్(09), కమార్తె అక్షర(06)లు ఉన్నారు. పోచవరం గ్రామానికి చెరుకొని తన సోదరుడు గోపాల్‌కు పని చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. ఇద్దరు పిల్లలను వీపు కట్టుకొని బావిలో దూకాడు. మరుసటి రోజు మృతదేహాలు బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనంచేసుకున్నారు.

Also Read: జెఇఇలో చిద్విలాసం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News