Thursday, January 23, 2025

లవర్ ఇంట్లో బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు… ఇద్దరు కులాలు వేర్వేరు కావడంతో పెళ్లి చేసుకోనని బాయ్‌ఫ్రెండ్ తెలపడంతో విషం తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లాలోని ధరమ్‌ఘఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నున్‌పాని గ్రామంలో ఓ బాలిక, బాలుడు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు వేర్వేరు కులాలు కావడంతో పెళ్లి చేసుకోవడం కుదరదని బాలికకు బాలుడు చెప్పాడు. దీంతో బతికుండగా కలిసి ఉండలేమని చనిపోదామని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: చిత్తూరులో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు

బాలుడి ఇంటి వద్ద ఇద్దరు విషం తాగాలని నిర్ణయం తీసుకున్నారు. బాలిక విషంతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలుడు మాత్రం విషంతాగలేదు. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విమ్సార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. బాలిక మృతదేహంతో బాలుడి ఇంటి ముందు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఎస్‌డిపిఒ అధికారు దిరాజ్ చోపాదార్ అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్నవారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News