Friday, December 27, 2024

దేశ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడు కలాం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:భారత దేశ చరిత్రను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ప్రపంచదేశాల్లో భారతదేశ ఖ్యాతిని పె ంచారని గుర్తు చేశారు. ఆయన అందించిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయల సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్‌ఎస్ నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, బొల్లెద్దు జానయ్య, రఫి, తాడూరి లింగయ్య గౌడ్, నయీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News