Saturday, November 23, 2024

ఎవరూ ఇవ్వని ధైర్యాన్ని కుటుంబం మాత్రమే ఇవ్వగలదు

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై బేబీ శాన్వి శ్రీషాలిని సమర్పణలో ‘కాలం రాసిన కథలు‘ అనే నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ అతిథిగా విచ్చేసి క్లాప్ ఇవ్వగా.. కార్పొరేటర్ దేదీప్య విజయ్ కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ “దర్శక నిర్మాత సాగర్ అద్భుతంగా కథను రాసుకున్నాడు. సినిమాలలో చిన్న-,పెద్ద అనేవి ఏవీ ఉండవు. ఏ సినిమాకైనా ఒకే కెమెరా, ఒకే కష్టం ఉంటుంది. అందుకే సాగర్ అందిస్తున్న ఈ చిత్రానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా”అని చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సాగర్ మాట్లాడుతూ “ఇదివరకు నేను ‘కొంటె కుర్రాడు అలియాస్ లోఫర్ గాడి ప్రేమ కథ’ అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించి విడుదలకు సిద్ధంగా ఉంచాను. ఇప్పుడు ఈ నూతన చిత్రాన్ని ప్రారంభించాను. ప్రపంచంలో ఎవరూ ఇవ్వని ధైర్యాన్ని కుటుంబం మాత్రమే ఇవ్వగలదు అనేదే ‘కాలం రాసిన కథలు’ కథాంశం. ఈ చిత్రంలో వెన్నెల, రీతూలు లీడ్ రోల్‌లో నటిస్తున్నారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా ప్రసన్న కుమార్, కథానాయికలు వెన్నెల, రీతూ, కొరియోగ్రాఫర్ వినైన్ విజయ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ : దేవి వరప్రసాద్, ఎడిటర్: మేకల మహేష్, మ్యూజిక్: మెరుగు అరమాన్, లిరిక్స్: శ్రీనివాస్ తమ్మిశెట్టి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News