సిటీ బ్యూరో: నగరంలో నెలకొన్న వరద ముంపు నివారణకు ఎస్‌ఎన్‌డిపి ద్వారా చేపట్టిన మరో నాలా పనులు పూర్తయ్యాయి. రూ.20 కోట్ల వ్యయంతో కళాసిగూడ నాలా అభివృద్ధి పనులు పూర్తికావడంతో శుక్రవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నగరంలో అనేక ప్రాం తాల్లో నెలకొన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ముగింపు పలికేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రత్యేక చొరవతో ఎస్‌ఎన్‌టిపి ద్వారా గ్రేటర్‌తో పాటు చుట్టు పక్కల మున్సిపాలిటీ, కార్పొరేషన్ల సుమారు రూ.885 కోట్ల వ్యయంలో 55నాలాల అభివృద్ధికి గత ఏడాది శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భా గంగా చేపట్టిన రసుల్‌పురా వద్ద ఫికెట్ నాలా నూతన బ్రిడ్జి ఇప్పటికే ప్రారంభించుకోగా ఈ నాలాకే సంబంధించి మినిస్టర్ రోడ్‌లో మరో బ్రిడ్జిను అభివృద్ధి చేశారు.
ఈ నాలా హాకింపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ప్రారంభమై ఈస్ట్ మారేడ్‌పల్లి గుండా రసూల్‌పురా మీదగా హూస్సెన్‌సాగర్ వద్ద ముగుస్తుంది. ఈ నాలా పరివాహక ప్రాంతం 4950 హెక్టార్లు కాగా, ఈ నాలా గుండా ప్రతి సెంకడ్‌కు 142.46 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహాం సామర్థం కాగా, ఈ బ్రిడ్జి వద్ద మాత్రం నాలా సామర్థ్ధం కేవలం 66.50 క్యూబిక్ మీటర్ల మాత్రమే ఉండడం తో ప్రతి వర్షకాలంలో నాలా పరిసరా ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా కాలనీలు ముంపు బారిన ప డుతుండడంతో దీని కారణంగా దాదాపు 2.67 లక్షల కుటుంబాలు ప్రభావితం అవుతున్నాయి.
దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా కళాసిగూడ వద్ద ఈ బ్రిడ్జిను ప్రతి సెకండ్‌కు 149.3 క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్ధంతో పునర్ నిర్మించా రు. దీంతో ప్రతి ఏటా వర్షకాలంలో వరద ముంపునకు గురవుతున్న పరిసర ప్రాంతాలతో పా టు ఎగువ ప్రాంతాలకు పూర్తి ఉపశమనం కలుగనుంది. ఈ నాలా బ్రిడ్జిను పునర్ నిర్మించడం ద్వారా నీరు సాఫీగా వెళ్లేందుకు మార్గం సుగమమం కావడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్నా నగర్ బస్తీ, ఏసియాలోనే అతిపెద్ద మురికివాడ అయినా రసూల్ పురా బస్తీ, బిహెచ్‌ఇఎల్ కాలనీ, ఇక్రీసెంట్ కాలనీ, సౌజన్య కాలనీ, బో యిన్‌పల్లిలోని పలు ప్రాంతాలతో పాటు సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలకు వరద ముంపు ప్రమాదం పూర్తిగా తొలిగిపోయింది.