Monday, December 23, 2024

కళావతి @50 మిలియన్ల వ్యూస్

- Advertisement -
- Advertisement -

Kalavathi song First to achieve 50 million views

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు మోస్ట్ ఎవెయిటింగ్ సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుండి విడుదలైన ‘కళావతి’ లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. పైగా ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ పాట. ఇది ఇప్పటికే రికార్డు సంఖ్యలో లైక్‌లతో 24 గంటల్లో అత్యధిక వీక్షణల రికార్డును బ్రేక్ చేసింది. కళావతి పాట మరో ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 50 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి సింగిల్ ఇది. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన ఈ పాట అన్ని మ్యూజిక్ అప్లికేషన్‌లలో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక, తమన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాట పాడగా, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాటకు చెందిన పనులు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News