Monday, December 23, 2024

కలయా నిజమా…

- Advertisement -
- Advertisement -

సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తోన్న మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాలిశ్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ‘కలయా నిజమా…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ “కలయా నిజమా పాటకు మోహిత్ ట్యూన్ వినగానే నచ్చింది. చిత్ర పాడిన తర్వాత ఈ పాటకు మరింత అందం వచ్చింది. లక్ష్మీ ప్రియాంక చాలా మంచి లిరిక్స్ అందించారు. డాలిశ్య చాలా మంచి పాత్ర చేసింది.

ఈ సినిమాలో సుధీర్ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపిస్తారు”అని అన్నారు. నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి మాట్లాడుతూ డైరెక్టర్ అరుణ్, హీరో సుధీర్, హీరోయిన్ డాలిశ్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. హీరో సుధీర్ మాట్లాడుతూ “ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జోనర్‌లో చేసిన మూవీ ఇది. హీరోయిన్ డాలిశ్య చక్కగా నటించింది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ బాలాజీ, డాలిశ్య, మోహిత్ రెహమానిక్, లక్ష్మీ ప్రియాంక, సన్నీ.డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News