Monday, December 23, 2024

చేవెళ్ల ఎంఎల్‌ఎ కాలె యాదయ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: చేవెళ్ల ఎంఎల్‌ఎ కాలె యాదయ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. షాబాద్ వద్ద కాలె యాదయ్య వాహనంపై కోడి గుడ్లతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కాలె యాదయ్య షాబాద్‌కు రావడంతో సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఆయనకు నిరసనసెగ తగిలింది. చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ భీమ్ వర్గాన్ని కలుపుకొని పోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. మాకు న్యాయం చేసేంత వరకు తాము వినేదిలేదని నిరసన తెలిపారు.  ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం జరిగింది.  ఇటీవల కాలె యాదయ్య బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గం ఇంచార్జీ భరత్, స్థానిక కాంగ్రెస్ వ్యతిరేకత చూపించినట్టు సమాచారం. ఇవాళ షాబాద్‌కు యాదయ్య రావడంతో ఆయనపై భరత్ వర్గీయులు కోడిగుడ్లతో దాడి చేసినట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News