Monday, July 1, 2024

కాంగ్రెస్‌లోకి కాలె యాదయ్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా ఈ క్ర మంలోనే శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీ లో సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరడంతో శాసనసభలో సభ్యుల బలం 72కు చేరింది. ఈ మేరకు ఎఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, యాదయ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తేరలేపింది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా బిఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు రేవంత్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సమాచారం.

ముందుగా దానం నాగేందర్ బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరగా ఆ తర్వా త భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్‌లో సీనియర్ నేత స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్‌పార్టీ కండువా కప్పుకొని, వరంగల్ ఎంపిగా తన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకు న్నారు. వారం రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచా రం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. పోచారం పార్టీలో చేరిన రెండు రోజుల తరువాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తు తం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు బిఆర్‌ఎస్ బలం 32మందికి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News