Wednesday, January 22, 2025

కాలే యాదయ్య వర్సెస్ మహేందర్ రెడ్డి… మాటల యుద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బిఆర్ఎస్ భవన నిర్మాణానికి కేవలం రూ.10కోట్లు ఇస్తున్నట్లు కాగితం మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ‘అయినా ఈ బిల్డింగ్ కాంట్రాక్టు మీరే అని, నిధులు మీకే వస్తాయంటూ మహేందర్ రెడ్డిని’ ఉద్దేశిస్తూ కాలే యాదయ్య మాట్లాడారు.  వెంటనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలగజేసుకొని ఏం మాట్లాడుతున్నావు అని కాలే యాదయ్యను హెచ్చరించినట్టుగా మాట్లాడారు. ఏ మాట్లాడొద్దా అంటూ యాదయ్య మహేందర్ ను నిలదీశారు. దీంతో ఇద్దరికి స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ సర్ది చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News