Tuesday, December 24, 2024

స్థల పరిశీలన లేకుండానే కాళేళ్వరం బ్యారేజిలకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

కాళేళ్వరం బ్యారేజిల స్థల పరిశీలన లేకుండానే ఆమోదం
సుందిళ్ల బ్యారేజి డిజైన్లు మార్చి అదనపు వెంట్లు
జస్టీస్ పిపి ఘోస్ ముందు ఎస్‌ఇ ఫజల్ వెల్లడి
లేఖలు సమర్పించిన మాజీ ఈఎన్‌సి
ముగిసిన విచారణ..మళ్లీ మంగళవారం నుంచి.. నోటీసుల జారీకి ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై బ్యారేజిల నిర్మాణ స్థలాలను పరిశీలించకుండానే వాటిని ఆమోదించినట్టు నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ ఫజల్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన లోపాలు తప్పిదాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.సి ఘోష్ కమీషన్ శుక్రవారం తన విచారణను మధ్యాహ్నం వరకూ కొనసాగించింది. సిడిఒ ఎస్‌ఈ ఫజల్ కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జస్టిస్ ఘోష్ అడిగిన పలు ప్రశ్నలకు ఫజల్ వివరణ ఇచ్చారు.

మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ పైల్స్‌కు వెళ్లాలని ఎన్‌ఐటీ వరంగల్ సిఫార్సుల మేరకు అప్పటి కాళేశ్వరం సీఈ చెప్పారని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎస్‌ఈ ఫజల్ తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి పలు కీలక ప్రశ్నలతో ఫజల్‌నుంచి వాస్తవాలు రాబట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి విచారణను మరింత లోతుగా చేపట్టారు.ఈ క్రమంలోనే సెంట్రల్ డిజైన్స్ ఎస్‌ఈ ఫజల్ కమిషన్ ముందు హాజరయ్యారు.

గతంలో జస్టిస్ ఘోస్ కమీషన్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారంతో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఫజల్ సమాధానాలు చెప్పారు. కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించినట్లు కూడా ఫజల్ స్పష్టం చేశారు. సుందిళ్ల ఆనకట్ట రెండో బ్లాక్ ఏ లో అదనపు ఆరు వెంట్లు డిజైన్స్‌లో మొదట లేవని, ఆ తర్వాత డిజైన్లు మార్పులు చేసి కొత్త వెంట్లను చేర్చినట్లు తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం మేరకే అదనపు వెంట్ల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. అటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సీడీఓ విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి శుక్రవారం కూడా కమీషన్ ముందు హాజరయ్యారు.

గురువారం నాటి విచారణకు కొనసాగింపుగా జస్టిస్ ఘోస్ అడిగిన సమాచారంతో మరో రెండు లేఖలను ఆయన కమిషన్‌కు అందజేశారు. విచారణ ముగిసిన అనతరం జస్టిస్ పి.సి.ఘోస్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. తిరిగి మంగళవావరం జస్టిస్ ఘోస్ నగరానికి చేరుకోన్నునారు. ఇదివరకే కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకంపై విచారణ ప్రక్రియలో బాగంగా అఫిడవిట్ల రూపంలో సమాచారం అందజేసిన వారిని ఒక్కొక్కరిగా మంగళవారం నుంచి విచారణ చేపట్టనున్నారు. ఎవరిని విచారణకు హాజరు కావాల్సింది, ఏ రోజు, ఏ సమయానికి కమీషన్ ఎదుట హాజరు కావాల్సింది తదితర వివరాలతో అందుకు సబంధించిన నోటీసులు వారికి అందజేసే చర్యలు చేపట్టాలని కమీషన్ సిబ్బదింకి ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News