Wednesday, January 15, 2025

కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా అక్టోబర్ 31 వ తేదీ వరకు విచారణ గడువును పొడిగిస్తూ శనివారం (ఆగస్టు 31న) జివో జారీ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి. ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. విచారణ కమిషన్ ఇప్పటికే నీటి పారుదల శాఖలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారిని విచారించింది. తాజా గడువు పొడిగించడంతో విచారణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News