Sunday, December 22, 2024

కాళేశ్వరం గుదిబండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర జలసంఘం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్‌కు అనుమతి రాకుండానే రూ.25,049 కోట్ల విలువ చేసే పనులు గుత్తేదార్లకు ప్రభుత్వం అప్పగించినట్టు వెల్లడించింది. పనుల అప్పగింతలో తొదరపాటు తనం ప్రదర్శించిందని తెలిపింది. సిడబ్యుసికి అందజేసిన డిపిఆర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం తక్కువగా చూపి ఆ తర్వాత అంచనాలు బూస్టప్ చేశారని తప్పుపట్టింది. ప్రాణహిత-చేవెళ్ల , కాళేశ్వరం ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ఫలితంగా రూ.767.78కోట్ల ప్రభుత్వ ధనం నిరర్ధకం అయ్యిందని వెల్లడించింది. సిడబ్యుసి స మర్పించిన డిపిఆర్‌లో ప్రాజెక్టు విలువ రూ.81,911కోట్లతో పోలిస్తే ప్రస్తుత విలువ రూ.1,47,427.41కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షల మూలధన వ్యయం పడిందని తెలిపింది. ప్రారంభం నుంచే ఆ ప్రాజెక్టు లాభదాయకం కాదు అన్న అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలకు విద్యుత్ చార్జీల కింద ఏటా రూ10,374కోట్లు అవసరం అని వివరించింది. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం ఏటా రూ.272కోట్లుగా నిర్ధారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నడవాలంటే ఏటా ప్రభుత్వం నుంచి నిర్వహణ కింద రూ.10,647. 26కోట్లు అవసరం అని తెలిపింది. ప్రాజెక్టు విలువ తరుగుదల కింద ఏటా రూ.2760.92కోట్లు( డిప్రిషన్) అవు తుందని అంచనా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పధకం ద్వారా ఏటా నిర్వహణ ఖర్చులే ఎకరానికి రూ.46,364 ప్రభుత్వం ఖర్చు చేయాల్సివస్తుందని వివరించింది. కాళేశ్వరం మూడవ టిఎంసీకి సిడబ్యుసి అనుమతి రాలేదని తెలిపింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను 50టిఎంసీల నీటినిల్వ సామర్దంతో నిర్మించినట్టు తెలిపింది. ఇందుకోసం ప్రభు త్వం రూ.6,126.80కోట్లు వ్యయం చేసిందని తెలిపింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో డీప్‌సిటేడ్ వెర్టికల్ పాల్ట్ ఉన్నట్టు తేలిందని , భూగర్భ లోతుల్లో నిటారుగా పగుళ్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా ప్రతిపాదిత స్థలంలో భూకంపాల సంబంధితంగా లోతైన అధ్యయనాలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. 2024 జూన్ నాటికే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రభుత్వం వెల్లడించిందని, అయితే ఈ ప్రాజెక్టు ద్వారా సంపూర్ణంగా ప్రయోజనాలు అందాలంటే ఇంకా చాలా ఏళ్లు పడుతుదని వెల్లడించింది. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కూడా ప్రమాదంలో ఉన్నట్టు 2020లోనే బయటపడిందని కాగ్ వెల్లడించింది. సంచలనం గొలిపే అంశాలతో రూపొందించిన కాగ్ నివేదికను ప్రభుత్వం గురువారం నాడు శాసనసభ , శాసనమండలిలో ప్రవేశపెట్టింది.
లిప్ట్‌ల కోసం 5643 మిలియన్ యూనిట్ల విద్యుత్
పీసీఎస్‌ఎస్ ప్రాజెక్టు రీ-ఇంజనీరింగు, ప్రాజెక్టు పనుల్లో చేసిన మార్పుల కారణంగా అప్పటికే అమలైన పనుల్లో కొన్ని భాగాలు నిరర్ధకమయ్యాయి. ఫలితంగా 1767.78 కోట్ల వష్టం వాటిల్లింది. పీసీఎస్‌ఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీలో మెస్సర్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (వాప్కోస్) ఇదివరకటి పనితీరులో అనేక లోపాలు ఉన్నాయి. అవే రీ-ఇంజనీరింగుకు కారణమయ్యాయి. అయినా సాగునీటి శాఖ కాళేశ్వరం ప్రాజె క్టు కోసం డీపీఆర్ తయారు చేసే పనిని అదే వాప్కోస్ సంస్థకు అప్పగించింది. పీసీఎస్‌ఎస్ ప్రాజెక్టులో చేసినట్లే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పనుల అప్పగింతలో సాగునీటి శాఖ అనుచిత తొందరపాటును ప్రదర్శించింది. 2018 జూన్‌లో కేంద్ర జలసంఘం డీపీఆర్‌ను ఆమోదించడానికి ముందే సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.25,049,99 కోట్ల విలువగల 17 పనులను అప్పగించింది. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కూ డా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారు. కేంద్ర జలసంఘానికి సమర్పించిన డీపీఆర్లో ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత అవసరం లేకు న్నా పంపింగ్ సామర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీలకు పెం చారు. దీనివల్ల రూ.28.151 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. అంచనాలను పాత ధరలలో తయారు చేయ డం, ధరల పెరుగుదలకు సంబంధించిన మొత్తాలను చేర్చక పోవడం వల్ల డీపీఆర్ ప్రాజెక్టు విలువను తక్కువ చేసి చూపడం జరిగింది. దీనితో పాటు ప్రాజెక్టు పనుల్లో చేసిన తదుపరి మార్పుల కారణంగా మొత్తం పనుల విలువ రూ.63.352 కోట్ల నుండి భారీగా పెరిగింది.
ఎకరాపైన మూలధనవ్యయం రూ.6.42లక్షలు
కేంద్ర జలసంఘానికి సమర్పించిన రూ.81.911.01 కోట్ల ప్రాజెక్టు విలువతో పోలిస్తే ప్రస్తుత ప్రాజెక్టు విలువ నూ.1,47,427.41 కోట్లను మించిపోయే అవకాశం ఉంది. సాగునీటిపై అయ్యే మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలుగా తేలుతోంది. ప్రాజెక్టు నుండి ఒనగూరే ప్రయోజనాల విలువను ఎక్కువగా చూపడం, వార్షిక వ్యయాలను తక్కువగా చూపడం ద్వారా ప్రాజెక్టు యొక్క ప్రయోజన-వ్యయ నిష్పత్తి (బీసీఆర్)ని హెచ్చుగా చూపడం జరిగింది. ఎత్తిపోతల పథకాలకు వర్తించే విద్యుత్ ఛార్జీల ధర ఒక్కో యూనిట్‌కు రూ.6.40 ఉండ గా, విద్యుత్ ఛార్జీలపై పునరావృత వార్షిక వ్యయాన్ని యూనిట్ రూ.3 చొప్పున తక్కువ రేటుతో అంచనా వేశారు. తక్కువగా చూపిన రూ.81,911.01 కోట్ల ప్రాజెక్టు అంచనా విలువతో చూసినా ఈ ప్రాజెక్టులో ప్రయోజన-వ్యయ నిష్పత్తి 0:75 (శాఖ అంచనా వేసిన 1:51 కు ప్రతిగా) గా తేలుతోంది. ఆరంభం మండే ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. తాజా ప్రాజెక్టు అంచనా విలువ రూ.1-,47,427.41 కోట్లు పరిగణనలోకి తీసుకుంటే ప్రయోజన – వ్యయ నిష్పత్తి 0:52 గా తే లుతోంది. అంటే, ఈ ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయి కీ కేవలం 52 పైసల విలువ గల ప్రయోజనం మాత్రమే చేకూరుతుంది. పనుల వ్యయం, నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ మరింత పెరిగే అవకాశం ఉంది.
విద్యుత్ చార్జీల కింద ఏటా రూ.10,374.56కోట్లు అవసరం
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్టులకు 8.459, 10 మె గావాట్ల విద్యుత్తు అవసరం. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉ న్న మొత్తం స్థాపిత సామర్థ్యంలో 46 82 శాతం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రతి ఏటా మొత్తం 14,344.39 మి లియన్ యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరమౌతుంది. పంపిం గ్ సీజన్లో అన్ని పంపులు ఏకకాలంలో పనిచేసే అవకాశం ఉన్నప్పుడు గరిష్ట విడ్యుచ్ఛక్తి డిమాండు రోజుకు 203.02 మిలియన్ యూనిట్లుగా తేలుతోంది. ఇది 2021—/22లో రాష్ట్రం మొత్తం మీద వినియోగించిన రోజు వారీ సగటు విద్యుచ్ఛక్తి (రోజుకు 196.06 మిలియన్ యూనిట్లు) కంటే అధికం. రాష్ట్రం ప్రస్తుతం దాదాపు 60 శాతం విద్యుచ్ఛక్తిని బాహ్య వనరుల నుంచే కొనుగోలు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ఉన్న పలు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును అందించడం రాష్ట్రానికి సవాలుగా మారనుంది. అదనం గా, వార్షిక నిర్వహణ ఖర్చు మరో రూ.272.70 కోట్లు, ఆవిధంగా, ప్రాజెక్టు వార్షిక నిర్వహణ కోసం సంవత్సరానికి 210,647.26 ౦ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎకరాకు రూ.46,364గా తేలుతోంది.
40వేల ఎకరాల్లోనే ఆయకట్టు పనులు
ఈ ప్రాజెక్టు కింద 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అందులో ఇంతవరకూ వాస్తవంగా కల్పించిన ఆయకట్టు కేవలం 40,888 ఎకరాలు మాత్రమే. రీ-ఇంజనీరింగ్ చేసి ఆరేళ్లు గడిచినా, మిగిలిన 3,43,148 ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులను ఇంకా అప్పగించలేదు. హెడ్ వర్క్, మెయిన్ కెనాల్స్ ఇచ్చినంతగా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రధాన కాల్వలు 57 శాతం పూర్తి కాగా ,డిస్ట్రిబ్యూటరీలు కేవలం 7 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 2024 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి అవుతుందని సాగునీటి శాఖ భావిస్తున్నప్పటికీ, పనుల ప్రస్తుత స్థితి, ఇంకా పూర్తి చేయాల్సిన పనుల పరిమాణాన్ని బట్టి చూస్తే మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసి, సంపూర్ణ ప్రయోజనాలను సాధించడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది.
రీ-ఇంజినీరింగు తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు కింద చేర్చిన నాలుగు పనుల్లో గత నాలుగేళ్లలో ఎలాంటి పురోగతి లేదు. 2016 జూన్‌లో రీ-ఇంజినీరింగు నిర్ణయం తీసుకున్న తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీ స్థలాన్ని, లక్షిత ఆయకట్టును, పనుల పరిధిని గుర్తించడానికి, డీపీఆర్ రూపొందించి సిడబ్ల్యుసికి సమర్పించడానికి ఆరేళ్లకు పైగా సమయం పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News