Thursday, March 13, 2025

కాళేశ్వరంలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుక లారీ

- Advertisement -
- Advertisement -

మహదేవ్ పూర్: భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఇసుక లారీ  అదుపుతప్పి ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. గత కొన్ని నెలలుగా ఇసుక మాఫీయా రెచ్చిపోతుందని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ రోజు వందల కొద్దీ ఇసుక లారీ నడుస్తున్నాయని వాపోతున్నారు.  ఇసుక మాఫియాకు అడ్డగా కాళేశ్వరం మారిందని ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News