హైదరాబాద్: నిజాంసాగర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించాడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కాళేశ్వరంలో కెసిఆర్ పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా కూడా పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చివేసిందని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే దేవాదులకు సంబంధించిన తూపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణం చేపడుతామని, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టులన్నీంటినీ త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి గోసను శాశ్వతంగా రూపుమాపాలన్నది ప్రభుత్వ లక్షమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టామన్నారు. వేసవికాలంలో 50 డిగ్రీలో ఉష్ణోగ్రత ఉన్న వేలాది మంది కార్మికులు 365 రోజులు పని చేశారని మెచ్చుకున్నారు. భూసేకరణతో పాటు వివిధ క్రాసింగ్‌లకు సంబంధించిన అంశాలను అధికారులను సమయోచితంగా, సమర్థవంతంగా పరిష్కరించారని, తెలంగాణ రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు పూర్తయిందన్నారు. వినియోగంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతుల కల నెరవేరినందుకు సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు. మేడిగడ్డ, తుపాకులగూడెం, దమ్ముగూడెం బ్యారేజీలకు కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదులు నీళ్లు కలిసిన తరువాత బ్యారేజీ నిర్మిస్తే ఎక్కువ కాలం నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించారన్నారు. వ్యాపోస్‌తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం: కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -