- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో తెలంగాణ ఇమేజ్‌ను గోదాట్లో కలిపారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లపై కేంద్రానికి వెంటనే లేఖ రాశానని వివరించారు. కేంద్రం నుంచి ఉన్నత స్థాయి కమిటీ వచ్చి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిందన్నారు. జాతీయ డ్యామ్ సెఫ్టీ అథారిటీ మరికొన్ని వివరాలు కోరిందని, భూ, పర్యావరణ పరీక్షలు సరిగా చేయలేదని జాతీయ డ్యామ్ సెఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ను అపర భగీరథుడిగా కీర్తించిందని, అన్ని ప్రాజెక్టులకూ కెసిఆరే చీఫ్ ఇంజినీర్ అని ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
- Advertisement -