Friday, April 25, 2025

నిర్మాణ లోపాలే శాపం

- Advertisement -
- Advertisement -

డిజైన్లు,నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు స్పిల్ వే
గేట్ల నిర్మాణంలోనూ అవకతవకలు బయటపడిన హైడ్రో
మెకానికల్ వైఫల్యాలు మేడిగడ్డ కుంగుబాటుపై నేషనల్
డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక ప్రభుత్వానికి
అందిన రిపోర్టు 378 పేజీలతో సమగ్ర నివేదిక
సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ వెలుగుచూసిన లోపాలు

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి ఏడో బ్లాక్ కుంగిన అంశంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అ థారిటి(ఎన్‌డిఎస్‌ఎ) నివేదిక భయంకరమై న వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిం ది. నిర్మాణ నాణ్యత లోపాలులే కారణమని తేల్చింది. డిజైన్ లో పాలు వెలుగులోకి వ చ్చాయని, స్పిల్‌వే గేట్ల నిర్మాణంలో లోపా ల కారణంగా ప్రమాదకర స్థి తులు ఏర్పడ్డాయని వెల్లడించింది.

బ్యారేజీల నిర్మాణ స మయంలో నీటిని నియంత్రించే ని ర్మాణా లు తగిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ప్రధాన కారణమని తే ల్చింది. మేడిగడ్డ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖ 2024 మార్చిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ)కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుం దిల్ల బ్యారేజీల రూపకల్పన, వాటి నిర్మాణాలను పరిశీలించింది.

కమిటీ తన తనిఖీల్లో మూ డింటిలోనూ నిర్మాణ భద్రతా లోపాలను గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్‌లో బ్లాక్- 7 వద్ద బీటలు, వంకరలు, హైడ్రో-మెకానికల్ వైఫల్యాలను గుర్తించింది. అన్నారం, సుం దిళ్ల బ్యారేజీలలోనూ అలాంటి నిర్మాణ లో పాలు, సీపేజ్, కాంక్రీట్ పగుళ్లు క నిపించాయని పేర్కొంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ మూడు బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టు కు కీలకంగా ఉన్నాయి. మేడిగడ్డ నుంచి అ న్నారం, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి, చి వరకు యల్లంపల్లి జలాశయానికి నీటిని లిఫ్టింగ్ చేస్తారు.

బ్యారేజీలు 2019లో వినియోగంలోకి వచ్చాయి. పలు బ్యారేజీలలో లోపల అనుమానాస్పద రంధ్రాలు ఉండే అవకాశం ఉందని, అవి ఇప్పటికీ ప్రమాదకరం కాకపోయినా, భవిష్యత్తులో ప్రమాదాలకు కారణం కావచ్చని వెల్లడించింది. ఈ మూడు బ్యారేజీలకు సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని కమిటీ తేల్చి చెప్పింది. భవిష్యత్తు చర్యలకు గట్టి సాంకేతిక మౌలికాధారంగా వ్యవహరించడానికి అక్కడి మట్టి పరిస్థితులపై విశ్లేషణ, హైడ్రాలిక్ మోడలింగ్, మేథమెటికల్ మోడలింగ్ అవసరమని సూచించింది. వర్షాకాలానికి ముందు నిర్మాణాలను తాత్కాలికంగా సంరక్షించడానికి కొన్ని అత్యవసర చర్యలు మరియు పరిక్షణలు చేపట్టాలని కమిటీ సూచించింది. హైడ్రాలిక్ మోడల్ అధ్యయనాల్లో కొన్ని కీలక వినియోగ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకపోవడం, అలాగే డిజైన్ లోపాలు వెలుగులోకి వచ్చాయి. స్పిల్‌వే గేట్ల నిర్మాణంలో లోపాల కారణంగా ప్రమాదకర స్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News