Monday, December 23, 2024

దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు కాళేశ్వరం

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి సెల్ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌస్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మూడు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్ కట్టి తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీరు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అని, తెలంగాణ ప్రతి రైతు పొలానికి నీరు అందించడమే కెసిఆర్ లక్షమని అన్నారు. అనంతరం మహాదేవపూర్ బిఆర్‌ఎస్ పార్టీ ఎస్‌సి సెల్ మండలాధ్యక్షుడు వేమునూరు జక్కయ్య శ్రీనివాస్‌ను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేవెల్లి నాగరాజు, చకినారపు చందు, మోతే సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News