హైదరాబాద్: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ విజయవంతం అయ్యిందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనగర్జన సభతో బిఆర్‌ఎస్ వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి బిఆర్‌ఎస్ శతవిధాలా ప్రయత్నించిందని మండిపడ్డారు. ఖమ్మం సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు పొంగులేటి తెలిపారు. నేతలంతా కలిసి పని చేశాం కాబట్టే సభ సక్సెస్ అయ్యిందన్నారు.
Also Read: జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈటల, దత్తాత్రేయ
పదవి ఉన్నా లేకున్నా ప్రజలు చూపిన ప్రేమ మరువ లేనిదన్నారు. సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందని, అనేక మంది బయటకు రావడంలేదన్నారు. మంత్రి పువ్వాడ సూచనలు కాంగ్రెస్‌కు అవసరం లేదన్నారు. పువ్వాడ కంటే చాలా తెలివైన వాల్లు కాంగ్రెస్‌లో ఉన్నారని, ఆర్‌టిఎ అధికారులు సభకు వచ్చే వాహనాలను అడ్డుకున్నారన్నారని పొంగులేటి మండిపడ్డారు. వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుని రెండేళ్ల పాటు కేబినెట్‌లోకి తీసుకోకపోయింటే మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండేగా హరీష్ రావు మారే వారన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కామ్ జరిగిందని కాగ్ తేల్చిందని పొంగులేటి విమర్శించారు.