Wednesday, January 22, 2025

తుంగతుర్తి ప్రాంత రైతాంగం

- Advertisement -
- Advertisement -

గత మూడు సంవత్సరాలుగా ఖరీఫ్, యాసంగికి పుష్కలంగా కాళేశ్వరం జలాలు – ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞత చెప్తున్న రైతులు
తుంగతుర్తి ప్రాంతంలో ముమ్మరంగా వరి సాగు

కాళేశ్వరం జలాలు, రైతు బంధు నిధులు ఏకకాలంలో రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న

Kaleshwaram water released to Thungathurthi

మనతెలంగాణ/తుంగతుర్తి: ఒక పక్క పుష్కలంగా కాళేశ్వరం జలాలు రా వడం మరో పక్క సకాలంలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధుడబ్బులు జమ కావడం పట్ల తుంగతుర్తి ప్రాంత రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఈ ప్రాంత రైతాంగం కృతజ్ఞతలు చెప్తోంది. అనాదిగా సాగు నీరు లేక పంట పొలాలు బీబీళ్ళుగా ఉండడంతో నాడు వందలాది కూలీలు వరి నాట్లకు ఇతర జిల్లాలకు వలస వెళ్లే వారు.గత మూడు సంవత్సరాలుగా కూలీలు ఏ గ్రామం నుండి కూడా వల స వెళ్ళిన దాఖలాలు లేవు.

పూడికతో కూడి ఎండిపోయిన చెరువులకు మి షన్ కాకతీయతో లోతుగా మారడం, వెను వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పూ ర్తయి గోదావరి జలాలు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల ద్వారా తుంగతుర్తి ప్రాంతానికి రావడంతో చిన్న కుంట నుండి పెద్ద చెరువుల వరకు నిండు కుండల్లా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న సాగు నీటి ప్రాజెక్టుల ని ర్మాణం ఏ ప్రాంతం వారు ఎంత లబ్ది పొందారో తెలియదు కాని తుంగతుర్తి ప్రాంతానికి మాత్రం నూటికి నూరు శాతం లబ్ది చేకూరిందనేది రైతుల మా ట. చెరువుల్లో పుష్కలంగా నీరుండడంతో బావులు , బోర్లు నీటి కుండల్లా మారాయి. వరుసగా మూడు సంవత్సరాలు రెండు పంటలు ఖరీఫ్ యా సంగి పుష్కలంగా వరి ధాన్యం పండుతోంది.

వచ్చిన గోదావరి జలాలు వృధా కాకుండా శాసన సభ్యులు డా క్టర్ గాదరి కిషోర్ కుమార్ నియోజక వర్గంలోని ప్రతి చెరువు నిండేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పుష్కలంగా గోదావరి జలాలు వచ్చాయి. తిరిగి యా సంగి వరి నాట్లు ప్రారంభం అవుతున్న ప్రస్తుత తరుణంలో గోదావరి జలాలు నియోజక వర్గంలోకి చేరుకున్నాయి. తుంగతుర్తి ప్రాంతంలోకి అన్ని గ్రామాలకు కాలువల ద్వారా , గొలుసుకట్టు చెరువుల ద్వారా చేరుకున్న గోదావరి జలాలతో గ్రా మాల రైతుల మొహాల్లో ఆనందం కనిపిస్తోంది. అం తేకాక సరిగ్గా వ్యవసాయ పనులు ప్రారంభం అ య్యే దశలోనే రైతు బంధు నిధులు తమ ఖాతాల్లోకి రావడంతో రైతులు మరింద సంబరపడిపోతున్నారు. ఎన్నో ఏళు అనావృష్టితో ఉన్న బీళ్ళు గత మూడేళ్ళుగా గోదావరి జలాలతో సస్యశ్యామలంగా పండుతున్నాయని , పెట్టుబడికి రైతు బంధు సైతం సకాలంలో అందుతున్నాయని రైతులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News