Friday, January 10, 2025

సూర్యాపేటకు కాళేశ్వరం జలాలు రాలేదు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని రంగాల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు రాలేదని మండిపడ్డారు. పాదయాత్రలో భట్టి మాట్లాడారు. వైఎస్‌ఆర్ జలయజ్ఞం ఫలితమే ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి సూర్యాపేటకు సాగునీరు అందిస్తామన్నారు. బెల్ట్ షాప్‌లను పెంచడంలో మాత్రం బిఆర్‌ఎస్ విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా యాదాద్రి పవన్ ప్రాజెక్టు పూర్తి కాలేదని చురకలంటించారు. ధరణి పేరిట ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పరిణితి లేని రాజకీయ నాయకుడు అని మండిపడ్డారు.

Also Read: 3 ఏళ్ల కిత్రం మహిళ అదృశ్యం… సెప్టిక్ ట్యాంక్‌లో అస్థిపంజరం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News