Sunday, February 2, 2025

కాళేశ్వరం రైతాంగానికి జీవనాడి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రుతుపవనాలు ఆసల్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల సాగునీటి అవసరాలను తీర్చగలుగుతున్నామని శుక్రవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి నది 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు 10 భారీ పంపింగ్ స్టేషన్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నామన్నారు. బాహుబలి మోటార్లతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. వరద కలువ ద్వారా మిడ్ మానేరు రిజర్వాయర్, ఎస్సార్‌ఎస్పీలోకి పంపింగ్ చేస్తున్నామని మంత్రి కెటిఆర్ విశదీకరించారు.

Kaleshwaram project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News