రాయ్‌పూర్ : జాతిపిత మహాత్మాగాంధీని దూషిస్తూ, గాడ్సేపై ప్రశంసలు కురిపించిన ఆధ్యాత్మిక గురువు, హిందూమత నేత కాళీచరణ్ మహరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో పట్టణానికి 25 కిమీ దూరంలో బాఘేశ్వర్ ధామ్ వద్ద గురువారం తెల్లవారు జాము 4 గంటల ప్రాంతంలో రాయ్‌పూర్ పోలీస్ బృందం ఆయనను అరెస్టు చేసినట్టు రాయ్‌పూర్ ఎస్‌పి ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు. అంతకు ముందు మూడు ప్రత్యేక బృందాలు కాళీచర్‌ణ్‌ను గాలించడానికి మహారాష్ట్ర, ఢిల్లీ కూడా వెళ్లాయి. వివిధ వర్గాల మధ్య విద్వేషం, శత్రుత్వం, దురభిప్రాయాలను సృష్టించే వ్యాఖ్యలు చేసినందుకు రాయ్‌పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేరకు ఈ కేసును రాయ్‌పూర్ పోలీసులు నమోదు చేశారు. రాయ్‌పూర్ లోని రావణ్ భాటా మైదానంలో ఆదివారం జరిగిన ధర్మసంసద్‌లో కాళీచరణ్ మాట్లాడుతూ రాజకీయాల ద్వారా దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్షమని , గాంధీజీని హత్య చేసిన గాడ్సేకు తాను వందనం చేస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహాత్మాగాంధీని దూషించిన హిందూమత నేత కాళీచరణ్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -