Thursday, January 23, 2025

వైవిధ్యమైన కథతో…

- Advertisement -
- Advertisement -

Kalingapatnam jeeva movie

రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కళింగపట్నం జీవా’. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రిత్విక్ చిల్లికేశల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడితో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. “చిత్ర మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కినట్లుగా తెలుస్తోంది” అని తెలిపారు. చిత్ర హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ “సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News