Monday, December 23, 2024

సిద్దిపేటలో కలియుగ దైవం

- Advertisement -
- Advertisement -
  • తిరుమల హంగులతో కొలువదీరనున్న వెంకన్న
  • సిద్దిపేట టిటిడి ఆలయానికి రూ.30 కోట్లతో ప్రణాళిక

సిద్దిపేట: కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలో కొలువుదీరనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబా ద్ రాష్ట్ర సచివాలయం నుండి ఆర్ అండ్ బి సెక్రెటరీ శ్రీనివాస్ రాజుతో కలిసి తిరుపతి టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో ఆలయ నిర్మాణ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తిరుపతి వేంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్ట దైవంగా ఇలావేల్పు గా కొలుస్తారని అలాంటి ఆలయం సిద్దిపేట నిర్మించడం గొప్ప అదృష్టమని అన్నారు. ఆలయ గర్భగుడి మొదలు కొని ఆల య నిర్మాణం క్రమాన్ని మంత్రి పరిశీలించి పలు సూచన లు చేశారు. సాక్షాత్తు కలియుగ దైవం అయిన తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయ మాదిరిగానే సిద్దిపేట టిటిడి ఆలయం నిర్మించాలని, చుట్టు ప్రాకారం భక్తులు కలియ తిరుగెల ఉండాలని అధికారులను సూచించారు.

భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులతో నిర్మాణం చేపట్టాలని, ఆ లయం తిరుపతి వైభవం ఉట్టిపడేలా ఉండాలని చెప్పారు. ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపన వచ్చే శ్రావణ మా సంలో అయ్యే విధంగా చూడలన్నారు. ఇటీవల సిద్దిపేట లో టిటిడి ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరం అయిన స్థలాన్ని పరిశీలించారన్నారు. స్థలాన్ని క్షేత్రస్థాయిలో తిరిగి కొలతలు తీసుకున్నారని తెలిపారు. దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమునా, డిజైన్స్‌ను రూపొందించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News