Monday, January 20, 2025

‘కల్కి2898 ఏడి’ మొదటి రోజు కలెక్షన్స్ రూ. 191.50 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కల్కి 2898 AD సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 191.50 కోట్లకు పైగా రాబట్టింది. ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం ‘ఎక్స్’(ఇదివరకటి ట్విట్టర్) వేదికలో పోస్ట్ చేశారు.

నాగ్ అశ్విన్ దర్శకుడు తీసిన ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె వంటి ప్రముఖులు నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం బాషలలో రిలీజ్ అయింది.

ఈ సినిమా ఇండియాలోనే రూ. 95 కోట్లు సంపాదించి ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసింది.  హిందీలో రూ. 27.5 కోట్లు ఆర్జించింది. వరల్డ్ వైడ్ గా చూసినప్పుడు మొదటి రోజే రూ. 191.5 కోట్లు గడించింది. ఈ సినిమా చూసిన వారు చాలా వరకు బాగుందనే అంటున్నారు. కొందరు కథ అర్థం కాలేదన్నారు. ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కానీ మొత్తం మీద సినిమా చూడదగ్గదనే అంటున్నారు. ఎందుకంటే అనేక మంది బడా నటులుండడమేకాక, సినిమాటోగ్రఫీ వగైరాలు ఈ మూడు గంటల చిత్రాన్ని కూర్చోబెట్టి చూయిస్తున్నాయి. సినిమా మొదటి భాగం అంత బాగా లేకపోయినప్పటికీ, రెండవ భాగంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News