Sunday, January 19, 2025

కల్కి సినిమా తీసిన వారికి లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘కల్కి 2898 ఏడి’ సినిమా వచ్చి నేటికి 25 రోజులయింది. ఇప్పుడు ఆ సినిమా తీసిని వారికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. నిర్మాతలు, నటులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లకు ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. 2024లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాపై కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్..  ఈ సినిమా హిందూ సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందంటూ, పైగా పురాణాలకు వ్యతిరేకంగా సినిమా  తీశారని కేసు వేశారు. ‘సనాతన ధర్మాన్ని మార్చడానికి వీలులేదని, దానిని వక్రీకరించకూడదని, కల్కి నారాయణుడు తము నమ్మే చివరి అవతార పురుషుడు, అది విష్ణువు చివరి అవతారం’ అని ఆయన వాదించారు.

కల్కి అవతారం గురించి పురాణాలలో లిఖించి ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఫిబ్రవరి 19న శ్రీ కల్కి ధామ్ వద్ద  శంకుస్థాపన చేశారని కూడా ఆచార్య ప్రమోద్ వెల్లడించారు. సినిమాలో హిందూ సెంటిమెంట్లతో ఆడుకుంటున్నందుకు తాము ఆక్షేపణ తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.  కాలక్షేపానికి నిర్మాతలు హిందు సెంటిమెంట్లను వాడుకోవడం సరికాదన్నారు. భావ స్వేచ్ఛ అంటే ధార్మిక విశ్వాసంతో ఆడుకోవడం కాదు’’ అని ఆయన వాదించారు. ఆచార్య ప్రమోద్ తరఫున లీగల్ టీసును సుప్రీం కోర్టు న్యాయవాది  ఉజ్వల్ ఆనంద్ శర్మ వారికి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News